Header Banner

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు! విషాదంలో కుటుంబం..

  Fri May 09, 2025 12:28        Politics

కర్రెగుట్ట తండాలో జరిగి ల్యాండ్ మైన్ పేలుడులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రౌహౌండ్స్‌ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ (26) మృతి చెందాడు. శ్రీధర్ మరణవార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితమే శ్రీధర్ ఉద్యోగంలో చేరాడు. శ్రీధర్‌కు తొమ్మిది నెలల క్రితమే శ్రీవాణితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో గ్రామంలో ప్రతీఒక్కరు కంటతడి పెడుతున్న పరిస్థితి. కాగా.. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ పేలుడులో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 7న కూంబింగ్‌‌ కోసం పోలీసులు వెళ్లగా నిన్న (గురువారం) తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించింది. తెలంగాణకు చెందిన ముగ్గురు గ్రౌహౌండ్స్ పోలీసులు అక్కడికిక్కడే మృతి చెందారు.

 

ఇది కూడా చదవండి: అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన పవన్ కళ్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్‌ ఐఈడీ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే మృతదేహాలను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ములుగుకు తరలించి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ పేలుడు అనంతరం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్యం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్‌ఎస్సై రణధీర్ గాయపడగా.. ఆయనను కూడా వెంటనే హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరణించిన కానిస్టేబుళ్ల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం హనుమకొండ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. మరోవైపు ఈ పేలుడు అనంతరం కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా.. వారిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్.జెడ్.సీ.మెంబర్ బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices